కర్నూలులో ‘వస్త్రమహల్’
1 min readప్రారంభించిన నటి రెజీనా,
- సాహితీ శేఖర్, రాంభూపాల్ రెడ్డి హాజరు
పల్లెవెలుగు: కర్నూలు జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వస్త్రాభిమానులకు శుభవార్త. మూడు అంతస్థులలో, 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి వారి వారి అభిరుచులకు సరిపోయేలా ఒక ప్రతిష్ఠాత్మకమైన వస్త్రప్రపంచం మీకు స్వాగతం పలుకుతోంది. కర్నూలులోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లో ‘వస్త్రమహల్’ వస్త్రదుకాణాన్ని ప్రముఖ నటి రెజీనా కెసాండ్రా శనివారం ప్రారంభించారు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుమార్తె, ప్రముఖ డాన్సర్ సాహితీ శేఖర్, పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వస్త్రాభిమానులు అందరూ సకుటుంబంగా విచ్చేసి వస్త్రమహల్‌లోని సంప్రదాయ, పాశ్చాత్య దుస్తులను చూసి ఆనందించాలని రెజీనా, సాహితీ శేఖర్ కోరారు. ఈ సందర్భంగా రెజీనా కెసాండ్రా మాట్లాడుతూ.. ‘‘ఈరోజు వస్త్రమహల్ ప్రారంభోత్సవానికి కర్నూలులో ఉన్నాను. అందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత పెద్ద షోరూం వెంకటేష్ గారు, రమణగారు ఇక్కడ తెరవడం ఎంతో సంతోషకరం. కుటుంబ వస్త్ర షోరూంను చూస్తుండటం ఇది మొదటి సారి. మొత్తం కుటుంబం కోసం అన్నిరకాల అందుబాటు ధరల్లో కావల్సిన వస్త్రాలు ఇక్కడ ఉన్నాయి. పెళ్లిళ్లకైతే ఇది వన్ స్టాప్ షాప్ అని చెప్పుకోవచ్చు. వస్త్రమహల్ యజమానులకు మంచి నాలెడ్జ్ ఉంది. ఎవరికి ఏం కావాలో వాళ్లకు బాగా తెలుసు. రమ, వెంకటేష్, అందరికీ ఆల్ ద బెస్ట్. కర్నూల్లో ఉన్నవాళ్లంతా ఇక్కడకు తప్పకుండా రండి. పురుషులు, మహిళలు, పిల్లలు అందరికీ కావల్సినవి, కావల్సిన ధరల్లో ఇక్కడ ఉన్నాయి. సాహితీ శేఖర్ మాట్లాడుతూ, ‘‘కర్నూలులో వస్త్రమహల్ గ్రాండ్ ఓపెనింగ్ చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్క పీస్ .. చీరలు, లెహంగాలు, అన్నీ చాలా బాగున్నాయి. వీటి క్వాలిటీ , రిచ్ నెస్ చాలా బాగున్నాయి. భారతదేశం నలుమూలల నుంచి వీటిని తీసుకొచ్చారు. ఇది ఒకరకంగా భారతీయ సంస్కృతి, ఆధునికతల కలబోతగా కనిపిస్తోంది. ఇక్కడ ఇలాంటి షోరూం రావడం చాలా బాగుంది. ఈ పరిసర ప్రాంతాల వాసులందరూ తప్పనిసరిగా ఇక్కడకు రండి.. థాంక్యూ’’ అని చెప్పారు.