PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్ ఎ. కె. హర్షవర్ధన్ ను అభినందించిన వీసి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లి డే పెరేడ్లో పాల్గొని రాయలసీమ విశ్వవిద్యాలయంతోపాటు కర్నూలుజిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేసిన వర్సిటీ ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్ ఎ. కె. హర్షవర్ధన్ ను వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ అభినందించారు. ఢిల్లీలోని కర్తవ్యపద్లో జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకల్లో ఎన్​ఎస్​ఎస్ తరపున ఎంపికైన హర్షవర్ధన్ వివిధ అంశాల్లో ప్రతిభకనబరచి అధికారుల ప్రశంసలు అందుకోవడంపట్ల వి.సి హర్షం వ్యక్తంచేశారు. హర్షవర్ధను స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది విద్యార్థులు ఎన్​ఎస్​ఎస్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రాథమిక ఎంపికల దశనుండి పెరేడ్లో పాల్గొనేవివిధ దశల్లో ప్రతిభచూపిన హర్షవర్ధను ఎన్​ఎస్​ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు అభినందించారు. జాతీయస్థాయి పెరేడ్లో పాల్గొనేవిధంగా తనకు వివిధ స్థాయిల్లో సహకరించిన యూనివర్సిటీ ఎన్​ఎస్​ఎస్ విభాగంవారికి, సెయిట్ జోసఫ్ కాలేజీ (సుంకేశులరోడ్) యాజమాన్యానికి హర్షవర్ధన్ ధన్యవాదాలు తెలిపాడు. రిపబ్లిక్ పెరేడ్కు ఎంపికైనప్పటినుండి తిరిగివచ్చేవరకు ప్రోత్సహించిన వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్కు హర్షవర్ధన్ కృతజ్ఞతలు తెలియచేశాడు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఎన్​ఎస్​ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డి, సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాల (సుంకేశుల రోడ్) ఎన్​ఎస్​ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *