ఆర్యుని సందర్శించిన ఇన్చార్జ్ వీసి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైసీఛాన్సులర్ ఆచార్య వి. ఉమ ఈరోజు వర్సిటీని సందర్శించారు. తిరుపతిలోని పద్మావతి మహిళావిశ్వవిద్యాలయ వి.సి.గా విధులు నిర్వహిస్తున్న ఆచార్య ఉమను రాయలసీమ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వి.సి గా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం GO RT No. 56ను 25.03.2025న విడుదల చేసింది. రాయలసీమ యూనివర్సిటీ వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లినకారణంగా ఈ నియామకం చేపట్టినట్లు రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి కోనశశిధర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ వి.సి. ఆచార్య వి. ఉమకు రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం వి.సి. ఛాంబరులో సైన్స్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్. నరసింహులు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య పి.వి. సుందరానంద్, రీసర్స్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో ఆచార్య ఉమ సమావేశమై వర్సిటీకి సంబంధించిన విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లుతోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఇన్ఛార్జ్ వి.సి.కి శుభాకాంక్షలు తెలిపారు.