‘వేదం’ నటుడు నాగయ్య మృతి
1 min read
వేదం సినిమా నటుడు నాగయ్య మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. వేదం సినిమాలో మొదటిసారిగ నటించిన నాగయ్య.. ఆయన నటన, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నారు. వేదం తర్వత అనేక సినిమాల్లో ఆయన నటించారు. దాదాపు 30 సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. లాక్ డౌన్ సమయంలో సినిమా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతన్న సందర్భంలో.. మా అసోసియేషన్ తోపాటు.. తెలంగాణ సీఎం కూడ ఆయనను ఆదుకున్నారు. ఇటీవలే ఆయన భార్య కూడ అనారోగ్యంతో మృతిచెందారు. గుంటూరు జిల్లా దేసవరం పేట ఆయన స్వస్థలం. ఆయన మృతికి సినీ రంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.