PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ కు `వీర్ చ‌క్ర‌` అవార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్​: భార‌త వాయుసేన వింగ్ క‌మాండర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ ను కేంద్ర ప్ర‌భుత్వం `వీర్ చ‌క్ర‌` పుర‌స్కారంతో స‌త్క‌రించింది. బాలాకోట్ ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త వాయుసేన దాడుల అనంత‌రం భార‌త్, పాక్ మధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన అభినంద‌న్ ను కేంద్రం సత్క‌రించింది. 2019లో కేంద్ర ప్ర‌భుత్వం ఈ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. సోమవారం గ్యాలెంట‌రీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీర్ చ‌క్ర అవార్డు అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌మంత్రులు హాజ‌ర‌య్యారు.

About Author