NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘వీరబల్లి’ ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా

1 min read

– ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి
పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుతామని ఎం పి పి గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనూతన ఎం పి పి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల ప్రజలు తమ కుటుంబానికి అండగా నిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా నూతనంగా ఎంపిక అయిన ఎం పి టి సి లు రాజేంద్రనాధరెడ్డి పురుషోత్తమ రెడ్డి. శ్రీదేవి జ్యోతిర్మయి,శ్రీనివాసులు, రెడ్డెమ్మ,భాగ్యలక్ష్మి,, నాగులయ్య,మల్లేశ్వరి,,ప్రమాణ స్వీకారం చేశారు.

మండల అధ్యక్షుడు గా గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి ఉపాధ్యక్షురాలిగా వి భాగ్యలక్ష్మి ని ఎన్నుకున్నారు. మండల కో ఆప్షన్ సభ్యులుగా ఎస్ థౌఫిక్ ను ఎన్నుకున్నారు. అనంతరం ఎం పి పి ని,ఎం పి టి సీలను శాలువాలు మరియు గజమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి,మాజీ ఎం పి పి విజయ భాస్కర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది పవన్ కుమార్ రెడ్డి యువ నాయకులు మదన్ రెడ్డి, వీరనాగిరెడ్డి, సర్పంచులు,జడ్ పి టి సి శివరాం,మండల నాయకులు ,గ్రామానాయకులు,వై సి పి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author