చంద్రబాబును కలిసిన వీరభద్రగౌడ్
1 min read
ఆలూరు , న్యూస్ నేడు : అలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడు సోమవారం రాత్రి ఉండవల్లి సచివాల యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిశారు. అలూరు టీడీపీలో చోటు చేసుకున్న తాజా పరిస్థితులను సీఎం చంద్రబా బుకు వివరించారు. ఇదిలా ఉండగా అలూరు టీడీపీ కీలక నేతల్లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో సమన్వయంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ అధిష్టానం ఇన్చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, నియోజకవర్గ పరిశీలకుడు పూల నాగరాజులతో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ముగ్గురు నాయకత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అదిష్టానం ఆదేశాల మేరకు వీరభద్రగౌడును ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును గౌడ్ కలవడం ప్రాదాన్యతను సంతరించుకుంది. అందరూ కలసికట్టుగా పార్టీకార్యక్రమాలు చేపట్టాలని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని చంద్ర బాయ్ తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా ఆగిపోయిన బళ్లారి- జడైర్ల జాతీయ రహదారి పనులు, దానాపురం-హోళగుంద రోడ్డు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వీరభద్ర గౌడ్ తెలిపారు. ఆయన వెంట టీడీపీ నాయకులు గిరి మల్లేష్ గౌడు, నేమకల్లు రవి యాదవ్ తదితరులు ఉన్నారు.