NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లోని దక్షణ కాశీగా పేరు గాంచిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ,ఆలయ పర్యవేక్షణ అధికారి రమణా రెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ పొలం రెడ్డి దశరథ రామి రెడ్డి ల అధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలుయాగాశాల ప్రవేశం,గణపతి పూజ,కంకణ దీక్షలు,శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి,పరివార దేవతల పూజలు తదుపరి ద్వజారోహణం తోఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ద్వాజారోహణలో బాగంగా వీరశైవ భక్తులు,వేద పండితులు నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి వారి శిష్యగణం మంత్రోచ్ఛాదారణలు, రకరకాల విన్యాసాలతో నృత్య ప్రదర్శన నిర్వహించారు.స్వామి వారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో కన్నడ ,తెలుగు రాష్ట్రాల ప్రజలుహాజరయ్యారు.వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు,అర్చకులు,ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author