భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయం.. గొప్ప పుణ్యక్షేత్రం..
1 min readఎంపి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి
రూ.1.58 కోట్లతో 5 అంతస్థుల పశ్చిమ రాజగోపురం, సాలహారంల నిర్మాణ పనులకు భూమి పూజ
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి లు పేర్కొన్నారు. సోమవారం రాయచోటి లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళీ వీరభద్ర స్వామి ఆలయంలో రూ.1.58 కోట్ల నిధులతో చేపట్టనున్న 5 అంతస్తుల పశ్చిమ రాజగోపురం, సాలహారంల నిర్మాణపనులుకు చేపట్టిన భూమి పూజలో ఎంపి, చీఫ్ విప్, మాజీ ఎం ఎల్ ఏ లు పాల్గొన్నారు. తొలుత ఆలయ ఈ ఓ మంజుల ఆధ్వర్యంలో వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోని ఉపాళాయాల్లో వీరభద్రునికి , అమ్మవారికి ప్రత్యేక పూజలు గావింప చేశారు. ఈ సందర్భంగా ఎంపి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి లు మాట్లాడుతూ వీరభద్ర స్వామి ఆలయ రాజగోపురం నిర్మాణ పనులకు సీఎం జగన్ చేతులమీదుగా శిలా పలకం ఆవిష్కరించబడి నేడు పనులు ప్రారంభం కావడం హర్షదాయ కమన్నారు. రాజగోపురం నిర్మాణ పనులను సుందరంగా , శిల్ప కళా నైపుణ్యం ఉట్టిపడేలా చేపట్టాలని ఈ ఓ కు సూచించారు.ఆలయ ప్రాశ స్త్యాన్ని విస్తరింప చేయాలన్నారు.
సన్మానం..: ఎంపి మిథున్ రెడ్డి,చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి లను ఆలయ వేదపండితులు దుస్సాలువలతో సత్కరించి , ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను ఆందచేశారు.
బంగారు రుద్రాక్ష మాలను అందచేస్తాం: ఎంపి మిథున్ రెడ్డి
భద్రకాళీ సమేత వీరభద్రునికి రూ 15 లక్షలు విలువ చేసే బంగారు రుద్రాక్ష మాలను త్వరలో అందచేస్తున్నట్లు ఎం పి మిథున్ రెడ్డి తెలిపారు.
మాడ వీధుల నిర్మాణానికి కృషి… : భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయ మాడ వీధుల నిర్మాణానికి కృషి చేస్తామని ఎం పి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లు తెలిపారు. ఆలయ గోడలకు ఆనుకుని పశ్చిమ దిశలో సుమారు 10 ఇళ్ళకు పరిహారంగా పట్టణంలో మరోచోట స్థలాలు ఇప్పించడం జరిగిందన్నారు. దీంతో మాడవీధులు నిర్మించుకు నేందుకు స్థల సమస్య పరిష్కారమైందన్నారు.