PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరమల్లు సూపరట..

1 min read

సినిమా డెస్క్​ : ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కళ్యాణ్​ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మక దర్శకుడు క్రిష్​ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పవన్ మొదటి సారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను చేస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకంతో అభిమానులు ఉండగా తాజాగా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఇటీవల ఒక చిట్ చాట్ లో నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తనకు ‘హరి హర వీరమల్లు’ మూవీలో ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇక సినిమా ఎలా తెరకెక్కుతుంది అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు గాను ఆమె ‘ప్రతి సన్నివేశం కూడా మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నారు’ అంటూ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆమె వ్యాఖ్యలను పవన్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. సినిమాపై వారు పెట్టుకున్న అంచనాలను నిధి అగర్వాల్ వ్యాఖ్యలు మరింతగా పెంచే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటే సెకండ్ వేవ్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. షూటింగ్ ను అతి త్వరలోనే స్టార్ట్ చేసి వచ్చే సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

About Author