PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమాల్లోకి వీర‌ప్పన్ కూతురు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్​: వీర‌ప్పన్.. రెండు రాష్ట్రాల పోలీసుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన గంధ‌పు చెక్కల స్మగ్లర్. వీర‌ప్పన్ ను ప‌ట్టుకోవ‌డం.. పోలీస్ డిపార్జ్మెంట్ కి అప్పట్లో స‌వాల్ గా మారింది. 2004లో చాక‌చ‌క్యంగా వీర‌ప్పన్ ను ఎనౌకౌంట‌ర్ చేశారు. ఇటీవ‌లే రామ్ గోపాల్ వ‌ర్మ కూడ వీర‌ప్పన్ గురించి సినిమా నిర్మించారు. అయితే.. ఇప్పుడు వీర‌ప్పన్ కుమార్తె ఏకంగా సినిమాల్లో రంగ‌ప్రవేశం చేసింది. పెద్ద కుమార్తె విద్యారాణి బీజేపీలో చేర‌గా.. చిన్న కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి సినిమా రంగంలోకి ప్రవేశంచారు. కేఆర్ రాజా అనే ద‌ర్శకుడి ద‌ర్శక‌త్వంలో వీర‌ప్పన్ కుమార్తె న‌టిస్తున్నారు. మావీర‌న్ పిళ్లై అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వీర‌ప్పన్ కుమార్తె .. అచ్చం వీర‌ప్పన్ లాగే భుజం మీద గ‌న్ పెట్టుకుని.. స్టిల్ ఇచ్చారు. దీంతో సినిమా క‌థాంశం ఏంట‌న్నది అంద‌రిలోను చ‌ర్చనీయాంశంగా మారింది.

About Author