వర్మ.. సేవలు చిరస్మరణీయం
1 min read– కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
పల్లెవెలుగు వెబ్, కడప: 35 ఏళ్ల జీవితం.. పోలీసు శాఖకు అంకితం చేసి… ప్రజల ఆదరాభిమానాలు పొందిన టూటౌన్ ఏఎస్ఐ కేఎస్ఆర్ వర్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. బుధవారం పదవీ విరమణ పొందిన టూ టౌన్ ఏఎస్ఐ కేఎస్ఆర్ వర్మకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్ ఏఎస్ఐగా పదవీ విరమణ పొందిన వర్మను ఘనంగా సన్మానించారు. ఆ తరువాత జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధత తో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. విధుల్లో చేరిన నాటి నుంచి అప్పటి పరిస్థితులను తట్టుకుని కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించడం మామూలు విషయం కాదన్నారు. పదవి విరమణ తరువాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. మరో పదేళ్ళ పాటు మీ అనుభవాలను సమాజానికి అందించాలని కోరారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబం లో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏ. ఆర్ అదనపు ఎస్పీ రిషికేశవ రెడ్డి, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, ఆర్.ఐలు మధు, సోమశేఖర్ నాయక్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు దూలం సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఉప్పు శంకర్, కో- ఆప్షన్ సభ్యులు బండారు రామకృష్ణ, పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.