ఉరుకుందలో భక్తులను నిలువు దోపిడి..?
1 min read– దేవాలయానికి రావాలంటే భయపడుతున్న భక్తులు ఆరోపణలు..?
– తలనీలకు మామూలు వసూలు తప్పనిసరినా..?
పల్లెవాణి వెబ్ కౌతాళం : మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.శనివారం అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రాన్ని చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.మరి కొంతమంది తల నీలాలు సమర్పించారు.ఒక తలనీలాలకు వంద రూపాయలు వసూలు చేస్తున్నారని, భక్తులు ఆరోపించారు. ఈ విషయం మీద ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లిన వారు,చూసి చూడనట్లు ఉండడం విడ్డూరమని భక్తులు బహిరంగనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఒకే వ్యక్తి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల, ఇలా జరుగుతుందా.? అనే సందేశం ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. దీనికి ఆలయ, జిల్లా ఉన్నత సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపుతారో లేదో వేచి చూడాల్సిందే.?