చిన్న రాజుపాలెం గ్రామంలో పశువైద్య శిబిరం
1 min readపల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : మండలం చిన్నరాజుపాలెం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి మరియు పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ పశువైద్య శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేశారు. తర్వాత గ్రామంలోని దూడలకు బృసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేశారు. అనంతరం వైయస్సార్ సంచార పశువాగ్యసేవ వాహనం గురించి పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు మానసవీణ, పసుపల సర్పంచ్ మోహన్ బాబు, చిన్న రాజుపాలెం తాండ సర్పంచ్ రమేష్ నాయక్, పశువైద్యులు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ తస్లిమ, కేవికే శాస్త్రవేత్త కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.