వెట్టి చాకిరి నిర్మూలనకు పాటుపడాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: వివిధ పనులలో, ఇతర పరిశ్రమలలో బాల కార్మికుల వెట్టి చాకిరి చేయించడం నేరమని కార్మిక శాఖ ఆధ్వర్యంలో చెన్నూరు లోని ఇటుకల బట్టి యజమానులకు అవగాహన కల్పించడం జరిగింది, బుధవారం ఉప కార్మిక కమిషనర్ చెన్నూరు పరిధిలోని ఇటుకల బట్టి లలో బాల కార్మికులు, వెట్టి చాకిరి కార్మిక శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా, ఉపకార్మిక కమిషనర్ బి.శ్రీకాంత్ నాయక్ మాట్లాడుతూ,ఇటుకల బట్టీలలో కానీ ఇతర పరిశ్రమలలో కానీ వెట్టి చాకిరి చేయించడం బాల కార్మికులను పనులలో పెట్టుకోవడం నేరమని పరిశ్రమల యజమానులకు ఆయన దిశా నిర్దేశం చేయడం జరిగినది అలాగే ఇటుకల బట్టీలలో పనిచేస్తున్న కూలీల వివరాలను వారికి అందుతున్న వేతనాలపై సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది, అలాగే ఇటుకల బట్టిలలో ఇతర పనులలో పిల్లలు చేత పనులు చేయించకూడదని ఒకవేళ అలా చేయించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో ఇతర కార్మిక శాఖ అధికారులు మహిళ సంరక్షణ కార్య దర్శిలు చంద్రకళ, లీలా రాణి, ఉమా మహేశ్వరి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.