వీహెచ్పి – బజరంగ్ దళ్ శౌర్య జాగరణ యాత్ర ప్రారంభం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ షష్ట్యబ్ది మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కేంద్రం సమితి నిర్ణయినుసారం దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ లోని యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 30 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 14 వరకు కర్నూలు జిల్లా కేంద్రం లోని పాతనగరం లోని జమ్మిచెట్టు వద్దగల శ్రీ లలితపీఠం. వద్ద విశ్వ హిందూ పరిషత్ నాయకులు మరియూ పీఠం వ్యవస్థాపకులు శ్రీ మేడా సుబ్రహ్మణ్యం(సుబ్బి స్వామి) ఆశీఃప్రసంగం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ శౌర్య జాగరణ యాత్ర దిగ్విజయంగా జరగాలని దేశంలో ధర్మం,దేశంకోసం పనిచేసే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీస్సులు అందించారు.కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర ద్వారా ప్రపంచంలోనే అత్యధిక యువతకలిగిన భారతదేశంలోని యువత దేశం సనాతన ధర్మం,సంస్కృతీ సంప్రదాయాలను నేర్పడం, చెడు వ్యసనాలు వంటి వాటి నుండి విముక్తి పొందాలని దేశంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.నగర అధ్యక్షులు టీ.సీమద్దిలేటి మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభమైన ఈ రథయాత్ర లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అన్నివేళలా రథాన్ని కంటికి రెప్పలా కాపాడాలని ఎటువంటి వివాదాలు లేకుండా రథయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయాలని హితవు పలికారు రాష్ట్ర ధర్మప్రసార్ రాష్ట్ర కన్వీనర్ ఏవీ ప్రసాద్ మాట్లాడుతూ బజరంగ్ దళ్ అంటే దేశం ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని సేవా సురక్షా సంస్కార్ ధ్యేయవాక్యంతో పనిచేస్తున్నదని హిందూ సమాజంలో హిందూ మానబిందువులపై జరిగే దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పనిచేస్తున్నదని,రక్తదానం,లౌజిహాద్, గోరక్షా,వంటి ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తున్న దాని తెలియచేశారు. అనంతరం నాయకులందరూ కాషాయ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర శౌర్య జాగరణ యాత్ర నిధి ప్రముఖ్ నీలి నరసింహ, శౌర్య జాగరణ యాత్ర స్వాగత సమితి కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ యాత్రాప్రముఖ్ మీనుగ రాజేష్,సహ యాత్ర ప్రముఖ్ సాయిరామ్ రథప్రముఖ్ గోవిందరాజులు,బౌధ్ధిక్ ప్రముఖ్ శివ ప్రసాద్,రోజువారి యాత్ర ప్రముఖ్ ఈపూరి నాగరాజు, సహసురక్షా ప్రముఖ్ నాగరాజు, కార్యక్రమ ప్రముఖ్ బగీరథ,యాత్ర ప్రసార ప్రచార ప్రముఖ్ రామకృష్ణ,ప్రఖంఢ ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి సునీల్, హరి,శేఖర్,జే.పీ.సింగ్, బాబూరావు,సంజీవుడు,రంగస్వామి,సురేష్, తదితరులు పాల్గొన్నారు.