వీహెచ్పి కార్యకర్తలు స్వయం సమృధ్ధి సాధించాలి
1 min read– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాబోయే రోజుల్లో హిందువులు,హిందూ సంస్థల్లో పనిచేసే కార్యకర్తలు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వంతంగా కాళ్ళపై నిబడి తమజీవనాన్ని గౌరవప్రదంగా జీవించాలనీ,దేశంకోసం,ధర్మం కోసం పనిచేయడం కోసం భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదినం సందర్భంగా బాలసాయిబాబా ట్రస్ట్ ఛైర్మెన్ శ్రీ రామారావు గారి దాతృత్వం అందించిన వివిధ రకాల వ్యాపార వస్తువుల ప్రారంభోత్సవం ఈరోజు ఉ.10:30 గం.లకు సేవా బస్తీ అయిన బుధవార పేటలోని మాతామారెమ్మ ఆలయం ముఖద్వారం వద్ద శివ అనే కార్యకర్తకు ఉచితంగా అందించి స్టీల్ టీస్టాల్ ప్రారంభోత్సవం జరిగిన అనంతరం జరిగిన సభలో అన్నారు, జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలందరూ తమ తమ కుటుంబాలను పోషణకొరకు శ్రమించాలనీ ఆతరువాత సంస్థకోసం సమయం కేటోయించాలనీ లేకపోతే కార్యకర్తలు ఆర్థికంగా కుంగిపోతారని ఉన్న సమయాన్ని కుటుంబానికీ,ధర్మం కోసం కేటాయించడంలో సమన్వయం పాటించాలనీ కోరారు, అనంతరం ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు,విశ్వహిందూపరిషత్ విభాగ్ సేవా కన్వీనర్ గురుమూర్తి మాట్లాడుతూ ర్నూలు నగరం లో సుమారు 10 మందికి వివిధ వివిధ రకాల వ్యాపార వస్తువులను విశ్వహిందూపరిషత్ కార్యకర్తల ఉపాధి కోసం అందించిన భగవాన్ బాల సాయిబాబా ట్రస్ట్ కన్వీనర్ రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ అనంత విశ్వప్రసాద్, ,బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి,విభాగ్ సేవా కన్వీనర్ గురుమూర్తి జిల్లా సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్,కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి,కార్యదర్శి ఈపూరి నాగరాజు,సేవా ప్రముఖ్ రఘునాథ్ సింగ్,వరసిద్ధి వినాయక ప్రఖంఢ కార్యదర్శి సంజన్న,ధర్మప్రసార పాల్గోన్నారు.