కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
1 min readపల్లెవెలుగు వెబ్ : రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కంటతడి పెట్టారు. రాజ్యసభలో ఎంపీల తీరు, నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సభలో అలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని కంటతడి పెట్టారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ పవిత్ర దేవాలయం లాంటిదని, అలాంటి సభలో కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారని అన్నారు. కొందరు సభ్యులు టేబుళ్లపై కూర్చున్నారని, కొందరు నిల్చున్నారని తెలిపారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలపడమేని అన్నారు. నిన్నటి పరిస్థితులు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదని, చాలా దురదృష్టకరమైన పరిస్థితి అంటూ కలత చెందారు. సభ ఇన్ని రోజుల పాటు స్థంభింపచేయడం మంచిది కాదన్నారు.