జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయండి
1 min read
జూనియర్ సివిల్ జడ్జి “ఏవీఎస్ శ్రీవల్లి”
పల్లెవెలుగు, పత్తికొండ: మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని జూనియర్ సివిల్ జడ్జి “ఏవీఎస్ శ్రీవల్లి” కోరారు. శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం లో జూనియర్ సివిల్ జడ్జి “ఏవీఎస్ శ్రీవల్లి” న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదులు తమ పరిధిలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులతో మాట్లాడి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు సురేష్ కుమార్, మైరాముడు, సత్యనారాయణ, వెంకట్రాముడు, నాగభూషణరెడ్డి, రమేశ్ బాబు, మల్లికార్జున, నాగేష్,నరసింహయ్య, సురేంద్ర కుమార్, కృష్ణయ్య, బాలభాష, మధుబాబు, శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు.