NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనంత‌పురం యాస‌లో విక్టరీ వెంక‌టేష్ మూవీ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: విక్టరీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం నార‌ప్ప. ఇది త‌మిళంలో ధనుష్ నటించిన అసుర‌న్ మూవీకి రీమేక్. నార‌ప్ప మూవీ క‌థా నేప‌థ్యం పూర్తీగా అనంత‌పురం యాస‌లో న‌డుస్తున్నట్టు స‌మాచారం. ఇందులో పాత్రలు పూర్తీగా అనంత‌పురం యాస‌లో మాట్లాడుతాయి. పూర్తీ గ్రామీణ నేప‌థ్యంలో ఉన్న నార‌ప్ప మూవీ. త‌మిళంలో వ‌చ్చిన మూవీ నేప‌థ్యానికి అనంత‌పురం సామాజిక నేప‌థ్యంతో పోలిక‌లు ఉండటంతో ఈ యాస‌ను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా సినిమాలోని న‌టీన‌టుల‌కు అనంతపురం యాస మీద శిక్షణ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. యాస విష‌యంలో ఎలాంటి త‌ప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాలో కొన్ని సీన్లు కూడ అనంత‌పురం జిల్లా క‌ళ్యాణదుర్గం ప‌ట్టణంలోని ఒక దేవాల‌యంలో చిత్రీక‌రించారు.

About Author