ఉత్పత్తిదారులతో వీడియో కాన్ఫరెన్స్..
1 min read– 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు బియ్యాన్ని
–మార్కెట్లో విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఏపీ ఎఫ్ సి ఐ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఆహార ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణిని తనిఖీ చేయడానికి ఓపెన్ మార్కెట్ సిల్ స్కీమ్ (డొమెస్టిక్) కింద 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని. అలాగే, నామినేటెడ్ ఎఫ్సీఐ డిపోల నుండి ఒక్కో డిపోకు ఒక్కొక్కరికి చొప్పున్న 1 నుండి 9 మెట్రిక్ టన్నులు వరకు చిన్న (ప్రైవేట్) వ్యాపారులకు గోధుమలను విక్రయించడానికి రిటైల్ స్కీమ్లో సదుపాయం కల్పించబడిందన్నరు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ చంద్ర శేఖర్ జోషి శుక్రవారం రాష్ట్ర పిండి మిల్లుల సంఘం, ఇతర పిండి మిల్లర్ల ప్రతినిధులు, ప్రైవేట్ వ్యాపారులు, బల్క్ కొనుగోలు దారులు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, OMSS (D) కింద టెండర్ ద్వారా గోధుమ మరియు బియ్యం అమ్మకానికి సంబందించిన పాలసీ గురించి చర్చించారు. నేడు, ఎఫ్సీఐ ఏపీ రీజనల్ కార్యాలయం, విశాఖపట్నం మరియు పోర్ట్ బ్లెయిర్ నుండి వరుసగా 1380 మెట్రిక్ టన్నులు & 1100 మెట్రిక్ టన్నుల గోధుమలను ఇ-వేలం ద్వారా అందించాయి. ఇంకా, రోలర్ ఫ్లోర్ మిల్స్ అభ్యర్ధన మేరకు, విశాఖపట్నం, రాజమండ్రీ, సామర్లకోట్ మరియు హనుమాన్ జంక్షన్ డిపోలకు 8 గోధుమ చేరవేసే రైళ్ళు ప్రణాళిక చేయబడ్డాయని ఒక ప్రకటనలో తెలిపారు .