PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి: విజిలెన్స్

1 min read

పల్లెవెలుగు,మిడుతూరు: ప్రభుత్వ అధికారులు నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని విజిలెన్స్ అధికారులు అన్నారు.బుధవారం మధ్యాహ్నం మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జి ఎన్ఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగినది.శ్రీమతి నీలం పూజిత రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి ఆదేశాల మేరకు ఉద్యోగులకు విజిలెన్స్ అవగాహన కల్పించారు.  వ్యవసాయ అధికారి మరియు చంద్రశేఖర్ రెడ్డి డిఇ విజిలెన్స్ ఆఫీస్ పి రామకృష్ణ,ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ ఆఫీస్ రూఫ్స్ రోనాల్డ్,మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు పనుల నిమిత్తం వచ్చినప్పుడు వారితో దురుసుగా ప్రవర్తించకుండా మంచిగా మాట్లాడాలని అదే విధంగా వారు కార్యాలయానికి వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి వారి సమస్యకు తగిన విధంగా సమాధానం ఇవ్వాలని అంతేకాకుండా కార్యాలయాల చుట్టూ అదే పనిగా తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు వారి పనులను పూర్తి చేయాలని అన్నారు. మీరు ప్రజలకు చేసే పనుల్లో ప్రజల నుండి ఒక్క పైసా కూడా తీసుకోకుండా మీరు వారికి పనులు చేయాలని అన్నారు. ఉద్యోగస్తులు అందరూ అవినీతికి నో చెప్పండి-దేశానికి కట్టుబడి ఉండాలని అదేవిధంగా చిత్తశుద్ధితో విధులు అవినీతి రహితంగా చేస్తూ పౌరులందరికీ సత్వరమే పారదర్శకంగా జవాబు దారీతనంతో విధులను   నిర్వర్తించాలని విజిలెన్స్ అధికారులు అవగాహన కల్పించారు.అక్టోబర్ 31 నుండి నవంబర్ 5వ తేదీ వరకు అధికారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు,జి ఎంఎస్కేలు,విఏఏలు పాల్గొన్నారు.

About Author