షాపులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు
1 min readపల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల లోని చికెన్ సెంటర్లు, హోటల్లు, టీ షాప్ లలో సివిల్ సప్లై విజిలెన్స్ అధికారి గూడూరు డిప్యూటీ తాసిల్దార్ నవీన్ కుమార్ ఆకష్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గోనెగండ్లలోని చికెన్ షాపులు, హోటల్లు, టీ షాపులు మొత్తం 12 షాపులు తనిఖీలు నిర్వహించి గృహ అవసరాలకు వాడే 14.5 కేజీల గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి, 21 సిలిండర్లను సీజ్ చేసి గోడౌనుకు తరలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదిహెను రోజుల క్రితం మకు వచ్చిన పిర్యాదు మేరకు దాడులు నిర్వహించామని అన్నారు. గృహ అవసరాలకు వాడే 14.5 కేజీల సిలిండర్లను హోటలలో చికెన్ షాప్ లలో టీ షాప్ లలో వాడరాదని అలా వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే హోటలలో, చికెన్ సెంటర్లలో టీ షాపులలోని యజమానులు 19.5 కేజీల సిలిండర్లు మాత్రమే వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి అర్ ఓ లు కిషోర్,రంగముని,గ్రామ సేవకులు దస్తగిరి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.