‘విజ్ఞాన పీఠం’లో … గణిత దినోత్సవం
1 min readకర్నూలు, పల్లెవెలుగు:భారతదేశానికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త .20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరని”” ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు నిమ్మగడ్డ చంద్రమోహన్ అన్నారు. ‘ శ్రీ రామానుజం తనకు సంప్రదాయకమైన పట్టా లేకున్నను మద్రాస్ విశ్వవిద్యాలయం ఇతని ప్రతిభను గుర్తించి 1913వ సంవత్సరంలో నెలకు 75 రూపాయల ఉపకార వేతనాన్ని మంజూరు చేసిందని, 13 సంవత్సరాలు నిండే సరికల్లా గణిత సిద్ధాంతాల పుస్తకాన్ని ఔపాసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడని చంద్ర మోహన్ తెలిపారు.డిసెంబర్ 22 వ తేదీ కర్నూలు శివారులోని విజ్ఞాన పీఠం ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో గణిత దినోత్సవం సందర్బంగా అన్నారు . ఈ కార్యక్రమంలో సుదర్శన్ రావు, రణధీర్ రెడ్డి, రేణుక, వంశీ రాఘవ తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు.