అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా 108 ప్రశ్న పత్రముతో పరీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: అయోధ్యలో శ్రీ బాల రామయ్య నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో ఆదివారం ఉదయం స్థానిక అమ్మవారీశాల లో ఉన్న పట్టాభిరామాలయములో 108 ప్రశ్న పత్రముతో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో దాదాపుగా 20 మందికి పైగా పరీక్ష రాశారని అయ్యపు వెంకట సుబ్రమణ్యం తెలిపారు.అదే విధంగా పరీక్షా కేంద్ర విధి విధానాల గురించి రిటైర్డ్ ప్రిన్సిపాల్ వేముల పోలిశెట్టి తెలిపారు.అదే విధంగా 22వ తేదీ సోమవారం రోజున పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బహుమతులు ఇవ్వటానికి కృషి చేశారు. మొదటి బహుమతి 1116 /- , రెండవ బహుమతి 716/- మూడవ బహుమతి 616/- , నాలగవ బహుమతి 516/- , అయిదవ బహుమతి 316/- కరారు చేసి బహుమతులు ఇస్తామని తెలిపారు.అంతే కాకుండా పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ అవోపా ఆధ్వర్యములో బహుమతులు ప్రదానం చేస్తామని అవోప అధ్యక్షుడు సుంకు రాజేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ పోలిశెట్టి , అయ్యపు వెంకట సుబ్రమణ్యం , సుంకు రాజేష్ , శ్రీనివాసులు , భగవాన్ , చెంచు సుబ్బారావు గుప్తా , బైసాని మురళిక్రిష్ణ , తదితరులు పాల్గొన్నారు.