విజయ్ దేవరకొండ మరో పవన్ కళ్యాణ్ !
1 min read
పల్లెవెలుగు వెబ్ : విజయ్ దేవరకొండను నిర్మాత దిల్ రాజు పొగడ్తలతో ముంచెత్తాడు. పవన్ కళ్యాణ్ తర్వాత యూత్ లో అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి విజయ్ దేవరకొండ అని అన్నారు. విజయ్ రూపంలో ఇండస్ట్రీకి మరో పవన్ కళ్యాణ్ దొరికాడని చెప్పారు. పెళ్లిచూపులు, గీతగోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ కి యూత్ లో క్రేజ్ పెరిగిందన్నారు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారనున్న విజయ్ కి అభినందనలు అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. రౌడీ బాయ్స్ చిత్రానికి సంబంధించిన సాంగ్ విడుదలకు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.