PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు బాయ్ కాట్ సెగ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా లైగర్‌కు బాయ్‌కాట్‌ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్‌ ఒక కారణమైతే, విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్‌ బాయ్‌కట్‌ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్‌ చడ్డా బాయ్‌కాట్‌ చేయడంపై విజయ్‌ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్‌ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. దీనికి తోడు ఓ ప్రెస్‌మీట్‌లో‌ విజయ్‌ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottLigerఅనే ‍హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.

                                                

About Author