రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు : డిప్యూటీ సీఎం ఆళ్లనాని
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తుల తుగాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. శుభ ప్రదమైన విజయదశమి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటామన్నారు. దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలు అందరూ తమ తమ రంగాల్లో సంపూర్ణ విజయం సాధించాలని, తెలుగు ప్రజలు అందరికి, అధికారులు, అనధికారులు, వైస్సార్సీపీ సభ్యులు, మీడియా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు,స్నేహితులు, సన్నిహితులు, ప్రతి ఒక్కరికి మంత్రి ఆళ్ల నాని సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండాలని ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించడం, శానిటేజర్స్ వినియోగించడం, బౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని మంత్రి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.