శశికళను కలిసిన విజయశాంతి !
1 min read
పల్లెవెలుగువెబ్ : దివంగత తమిళనాడు ముఖ్యమత్రి జయలలిత సన్నిహితురాలు శశికళతో బీజేపీ నేత విజయశాంతి భేటీ అయ్యారు. చెన్నైలో ఈ భేటీ జరిగింది. మర్యాదపూర్వకంగా భేటీ జరిగిందని చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి విజయశాంతి జ్ఞాపకం చేసుకున్నారు. శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశికళ చాలా కీలకంగా వ్యవహరించారు. ఆమె మరణానంతరం శశికళ ప్రాభవం తగ్గింది. పలు కేసుల్లో శశికళ జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అన్నాడీఎంకేలో పట్టు కోసం శశికళ తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.