పది’లో విజయవాణి విద్యార్థుల విజయ దుందుభీ..
1 min read
500కు పైగా 85 మంది విద్యార్థులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో విజయవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. బుధవారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 168 మంది విద్యార్థులకు గాను 167 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కనబరిచారు.500కు పైగా 85 మంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని పాఠశాల కరస్పాండెంట్ కె.వి రామిరెడ్డి అన్నారు.జి జయంత్ 596,రస్మిత 591,అఫ్సినా 590,షాహిద్ ఆఫ్రిద్ 586, అబ్దుల్ రహమాన్ 585,రాధిక 585,షంషున్ 585 మరియు మధు కుమార్,కీర్తన,చైతన్య కుమార్,నేహా తదితర విద్యార్థులు మంచి ఫలితాలతో ఉత్తీర్ణత కనబరిచినట్లు పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న ఫలితాలు అనంతరం పాఠశాలలో కరస్పాండెంట్ రామిరెడ్డి, పాఠశాల ప్రెసిడెంట్ చిలుకల రామ సుబ్బారెడ్డి,డైరెక్టర్ చిలుకల శేఖర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదువుతూ మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చే విధంగా మీరు ముందుకు వెళ్లాలని వారు విద్యార్థులను ఆకాంక్షించారు. ఇంతటి ఫలితాలు మాకు వచ్చినందుకు గాను విద్యార్థులు కూడా ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.