వికసిత్ భారత్ సంకల్పయాత్ర సమర్థవంతంగా నిర్వహించాలి..
1 min readశిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : భీమడోలు చక్కటి ప్రణాళిక సమన్వయంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి ఆదేశించారు.భీమడోలు ఎంపీడీవో కార్యాలయం లో బుధవారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహణపై మండలంలోని వివిధ శాఖల అధికారులు, సచివాలయాల వాలంటీర్లతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాటిని గ్రామస్థాయిలో నిర్వహించే వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమంలో లబ్ధిదారులకు వివరించాలని తెలిపారు. మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్న అన్ని పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఇంకా పథకాలు లబ్ధి పొందని వారిని గుర్తించి వారికి కూడా పథకాలు అందే విధంగా చొరవ చూపాలన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష భీమా యోజన, పోషణ శక్తి నిర్మాణ అభియాన్ , జన దన్ యోజన, పశు వికాస్ వికాస క్రెడిట్ కార్డు, తదితర పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. మండలంలో నిర్వహించే వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర కు కేటాయించిన వాహనం పర్యటన ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికను తీసుకోవాలని పేర్కొన్నారు.జిల్లా పరిషత్ సీఈవో కె ఎస్ ఎస్ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. గ్రామస్థాయిలో స్వాగత, సాంస్కృతిక ,ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కే ఖాజావలి, సివిల్ సప్లై డి ఎస్ ఓ సత్యనారాయణ రాజు, మరియు డి ఎల్ డి ఓ, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ సి సత్యనారాయణ, ఐ సి డి ఎస్ పి డి పద్మావతి, పశు సంవర్డక శాఖ జేడీ నెహ్రూ బాబు, తాహాసిల్దార్ ఇందిరాదేవి, ఎంపీడీవో పద్మావతి దేవి,తదితరులు పాల్గొన్నారు.