ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పరిపాలన
1 min readడీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ తరగతులను ప్రారంభించిన జడ్పీ సీఈఓ సుబ్బారావు
మహిళా భాగస్వామ్యంతో సమాజ అభివృద్ధి అన్న పీడీ డి.ఆర్.డి.ఏ విజయరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ పరిపాలన జరుగుతే నిజమైన గ్రామ స్వరాజ్యమని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో పారదర్శికత తీసుకురావడానికి, ప్రజా భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి ప్రణాళికలు జరపాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఈ శిక్షణ తరగతుల ద్వారా సిబ్బంది నెరవేర్చాలని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమీషనర్ శ్రీమతి సూర్యకుమారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు విస్తరణ అధికారులకు, మండలం ప్రజా పరిషద్ పరిపాలన అధికారులకు, పంచాయతీ కార్యదర్సులకు, మండలస్థాయి కోఆర్డినేటర్స్ కు రెండు రోజులు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని జడ్పీ సీఈఓ వెంకట సుబ్బారావు ప్రారంభించారు. సందర్బంగా జిల్లాస్తాయి అధికారులు పాల్గొని శాఖలవారీగా అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలుపై అవగాహన కల్పించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ విజయరాజు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలు తయారిలో మహిళా భాగస్వామ్యం ఉండాలన్నారు. పీడీ గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ రాము మాట్లాడుతూ ఉపాధి గ్రామీణ హామీ పథకం సమర్థవంతంగా గ్రామ స్థాయిలో జరగాలంటే ముందస్తు ప్రణాళికలు అవసరం అన్నారు. శిక్షణ తరగతులలో, నగదు రహిత కార్యక్రమాలు, ప్రజా ప్రణాళిక ఉద్యమం యొక్క లక్ష్యాలు, ప్రణాళికలు తయారిలో అధికారుల పాత్ర, గ్రామ పంచాయతీ ఫంక్షనల్ కమిటీలు ఏర్పాటు, జిపిడిపి యొక్క అమలు నివేదిక, బాల సభ, మహిళా సభ నిర్వహణ, ఈగ్రామస్వరాజ్ తదితర అంశాలుపై సిబ్బందికి శిక్షణ తరగతులలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజర్ ప్రత్సంగి రాజు, డి.యల్.పి.ఓలు చంద్ర శేఖర్, రాజాఉల్లాహ్, సుందరి, డిపియం పులి వెంకట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.