PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలసి మెలసి ఉంటేనే గ్రామ అభివృద్ధి:జేసీ

1 min read

– చెరుకుచెర్ల గ్రామసభలో రసా భాసా
– మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి
– గ్రామ సభను వాయిదా వేసిన జాయింట్ కలెక్టర్ నిశాంతి

పల్లెవెలుగు,వెబ్​ మిడుతూరు: మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామంలో పొలాలకు పైకావిలి కాసే వ్యక్తులను నియమించే విషయమై మానవ హక్కుల కమిషన్ కు గ్రామానికి చెందిన మాణిక్ రాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో సమస్యను పరిష్కరించాలని మానవ హక్కుల కమిషన్ నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతిని ఆదేశించడంతోఆమె గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఇరు వర్గాల వారిని పిలిపించి గ్రామంలో అందరూ ఒక్క తాటిపై ఉండాలని అప్పుడే గ్రామానికి మంచి జరుగుతుందని ఇరు వర్గాలకు చెందిన వారిని గ్రామ సభకు పిలిపించారు.ముందుగా ఇరు వర్గాల నుంచి ఒక్కొక్కరిని మాట్లాడించారు.అన్ని కులాల నుంచి ఒక వర్గం నుంచి నాలుగు పేర్లు ప్రతిపాదించగా ఇంకో వర్గం వారు ఒప్పుకోలేదు. పాత లెక్కలు చూపించాలి మా పొలాలకు మేమే పైకావలి చూసుకుంటామంటూ మరో వర్గం వారు ఈ గ్రామసభ మాకు ఇష్టం లేదని వారు ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా జాయింట్ కలెక్టర్ ప్రసంగిస్తూ మాకు ఎన్నో పనులు ఉన్నా కూడా ఎంతోమంది అధికారులు మీ గ్రామానికి వచ్చారు మీ గ్రామ అభివృద్ధి కోసం మేము ఇక్కడికి వస్తే మీరు వెళ్తామంటూ చెప్పడం ఏంటని జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక వర్గం చెప్పినవారు ఇంకో వర్గం ఒప్పుకోకపోవడంలో మీ గ్రామం నష్టపోతుందని అంతేకాకుండా మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అందరు కలిసి మెలసిగా ఉండాలని జెసి ఇరు వర్గాల వారికి హితబోధ చేసినా ఎవరూ వినలేదు.సుమారు 6 మంది ఎస్ఐలు ముగ్గురు సీఐలు దాదాపు 100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించినా ఎవరికి వారు జెసికి వినిపించడంతో దాదాపు జేసి నాలుగు గంటల శ్రమించి చేసేది లేక గ్రామసభను వాయిదా వేశారు.ఏవర్గానికి ఎంతమంది చేతులెత్తుతారో వారిని లెక్కించగా గ్రామసభలో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవడంతో గ్రామసభను జాయింట్ కలెక్టర్ నిశాంతి తాత్కాలిక వాయిదా వేసి వెళ్ళిపోయారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో ఎం దాసు,నందికొట్కూరు,ఆత్మకూరు సిఐలు సుధాకర్ రెడ్డి,విజయభాస్కర్, సుబ్రహ్మణ్యం,ఎస్ఐలు మారుతి శంకర్,నాగార్జున, అశోక్,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఏవో పీరు నాయక్,సీనియర్ అసిస్టెంట్ రాంభూపాల్ రెడ్డి,ఆర్ఐ భాష తదితర అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author