గ్రామ స్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీర్చదిద్దడమే లక్ష్యం
1 min readహోళగుంద మండల కేంద్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం లేకుండా గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు.హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ఆవరణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుమ్మనూరు ఈశ్వర్ ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచే విధంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రీడా సంబరాలు 47 రోజుల పాటు జరుగుతాయన్నారు. ఐదు దశల్లో పోటీల నిర్వహణ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15000కు పైగా సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని.. సుమారు రూ.12 కోట్ల విలువైన బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో 5 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తామని.. విజేతలకు మండల స్థాయిలో 12 రోజులు పోటీలు జరుగుతాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో మరో ఐదు రోజులు పోటీలు నిర్వహించి.. విజేతలు జిల్లా స్థాయిలో.. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 7 రోజుల పాటు జిల్లా స్థాయి, ఆ తర్వాత 5 రోజుల పాటు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ పోటీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు..ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.