గ్రామ సమస్యలు పరిష్కరించాలి కెసిటిఆర్ యూత్ సభ్యులు…
1 min read
పల్లెవెలుగు వెబ్ హోలగుంద: ఇంగలదహల్ గ్రామంలో రాష్ట్రా కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు సచివాలయం ప్రారంభోత్సవానికి గడపగడప కార్యక్రమానికి వచ్చిన మంత్రికి కేసి తిమ్మారెడ్డి యూత్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు విరేష్ చంద్రశేఖర్ యూత్ సభ్యులు గ్రామంలోని సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీలు,సిసి రోడ్లు మరియు తాగునీటి కుళాయి కలక్షన్ గురించి అదేవిధంగా పాఠశాలకు రహదారి గురించి మంత్రికి తెలియజేయగా గడపగడపకు కార్యక్రమానికి వచ్చిన నిదులతో సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాండు, రాజు,మహేష్,ఎస్ఎఫ్ఐ మల్లికార్జున గ్రామ పెద్దలు పాల్గొన్నారు.