గ్రామ సచివాలయ సిబ్బంది.. పొమ్మనలేక పొగ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని పొమ్మనలేక పొగబెడుతోందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు, వార్డు సచివాలయ సిబ్బందికి మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత అప్పగించడం దుర్మార్గమన్నారు. ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం రోజురోజుకూ దిగజారుతోందని మండిపడ్డారు. గుంటూరులోని 5 చోట్ల మరుగుదొడ్ల దగ్గర వాలంటీర్లను రోజుకు 8 గంటలు చొప్పున పనిచేయాలని ఆదేశించారని చెప్పారు. వాలంటీర్లకు జీతాలు పెంచమంటే స్వచ్ఛంద సేవకులంటున్న సీఎం..ఇప్పుడు వారిని పారిశుద్ధ్య కార్మికులుగా మారుస్తున్నారని చెప్పారు.