పల్లెనిద్ర కార్యక్రమం.. గ్రామంలో ప్రశాంతంగా జీవించండి
1 min read– సిఐ శ్రీనివాస్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కర్నూల్ రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి మరియు ఎస్ఐ మల్లికార్జున బుధవారం నాడు తన సిబ్బందితో కలిసి శకునాల మరియు కన్నమడకల గ్రామాలను సందర్శించి కనమడకల గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు . సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రత పైన, చదువు యొక్క ప్రాముఖ్యత గురించి, ఆన్లైన్ మోసాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భూతగాదాలు ఏమైనా ఉన్నట్లయితే రెవెన్యూ అధికారులు సంప్రదించి పరిష్కారం చేసుకోవాలని మరియు గొడవలు పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ఎవరైనా అల్లర్లకు, గొడవలకు పాల్పడితే అటువంటి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖాసీం,గ్రామ పెద్దలు సోమశేఖర్ రెడ్డి, తిక్కలి వెంకటేష్ మరియు ఓర్వకల్ పోలీసులు వీరారెడ్డి, బలరాం,నజీర్,దాసు పాల్గొన్నారు.