PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ సర్వేయర్లా..మజాకా.. పైసలు లేనిదే ముందుకు కదలని వైనం

1 min read

-పొలాలు కొలతలు వేయాలంటే మామూలు ఇచ్చుకోవాల్సిందే -ఒక్క పైసా అడిగినా నాకు ఫోన్ చేయండి:మండల సర్వేయర్

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 14 సచివాలయాలు..ప్రతి సచివాలయానికి గ్రామ సర్వేయర్ ఉన్నారు.వారికి సంబంధించిన పరిధిలో ఉన్న రైతుల పొలాలను కొలతలు వేస్తూ ఎవరికి ఎంత పొలం ఉంది అనేది రైతులకు ఆ కొలతల ద్వారా సర్వేయర్లు రైతులకు రిపోర్ట్ ఇవ్వాలి.కానీ ఇక్కడ పనిచేసే గ్రామ సర్వేయర్లా…లేక మజాకా… అన్న చందంగా ఉన్నారు.పైసలు లేనిదే ముందుకు వారు కదలడం లేదా..పొలాలను కొలతలు వేయుటకు సర్వేకు వెళ్లాలంటే ముందుగానే ఎంత ముట్ట చెప్పాలనేది రైతులతో మాట్లాడుకోవాలా..వేల రూపాయల కొద్దీ ముడుపులు ముట్ట చెప్పాల్సిందేనా..అంటే అవుననే రైతుల్లో సమాధానం వినబడుతోంది.కూలీ,నాలీ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు తమ పొలాల్లో కష్టపడుతూ పొలాల్లో హెచ్చుతగ్గులు ఉంటే వాటిని సరి చేయాలని సచివాలయాలకు వెళ్తే గ్రామ సర్వేయర్లు పొలాలను అప్పుడు కొలతలు వేస్తాం ఇప్పుడు కొలతలు వేస్తామంటూ నాన్చుడు ధోరణి చేస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు అంటున్నారు.అంతేకాదు మండలంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ఎదుటే వేల కొద్ది రూపాయలు ఇవ్వాలని గ్రామ సర్వేయర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారని 7వేల రూపాయలు ఇచ్చినా మా పొలాన్ని కొలతలు వేయటం లేదంటూ ఓమహిళ అన్ని శాఖల మండల అధికారుల ముందే ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది.వెంటనే ఎమ్మెల్యే సచివాలయ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావద్దని ఒక పైసా లేకుండా మీకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందని ఎమ్మెల్యే వారిని మందలిస్తూ రైతుల నుంచి ఒక పైసా తీసుకోకుండా మీరు విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సీరియస్ అయినా కూడా వారిలో మార్పు అనేది కనిపించడం లేదు గ్రామ సర్వేయర్లలో మాత్రం ఉలుకు లేదు పలుకు లేదు అన్న చందంగా వారు విధులు నిర్వహిస్తున్నారు అంటూ అంతేకాకుండా వివిధ గ్రామాలలో గ్రామ తలారులను మధ్యవర్తిగా పెట్టుకుంటూ పొలాల కొలతలకు ముందుగానే ముడుపులు ఎంత ముట్ట చెప్పాలనేది క్లియర్ చేసుకోవాల్సిందేనని రైతులు అంటున్నారు. మండల సర్వేయర్ ఎల్.కృష్ణుడును వివరణ కోరగా మండలంలో ఎవరైనా సరే గ్రామ సర్వేయర్లు రైతుల నుంచి డబ్బులు అడిగినా రైతులు ఎవ్వరూ ఒక్క పైసా కూడా ఇవ్వవద్దని,మీ పొలాలను కొలతలు వేయుటకు గ్రామ సర్వేయర్లు సతాయించినా మిమ్ములను డబ్బులు అడిగినట్లయితే నాదృష్టికి తీసుకు వచ్చినట్లయితే వారి పైన తగు చర్యలు తీసుకుంటామని అదే విధంగా గ్రామ సర్వేయర్లు రైతులను ఒక్క పైసా అడిగినా కూడా నాకు ఫోన్ చేయాలని మండల సర్వేయర్ కృష్ణుడు సెల్ నెంబర్-7013905968 నాకు ఫోన్ చేయాలని రైతులకు తెలియజేశారు.

About Author