PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామవాలంటీర్ల సేవలు.. అభినందనీయం:.. ఎమ్మెల్యే

1 min read

–  గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లకు పురస్కారాలు

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు అవినీతికి తావు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు  అందిస్తూ అందరి మన్ననలు పొంది నిస్వార్థంగా సేవలందిస్తున్న, సేవ సైన్యం వాలంటీర్ల అందరికీ సలాం చేస్తున్నామంటూ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం, పురస్కారాలు ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి అందజేశారు, సోమవారం సాయంత్రం చెన్నూరు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వాలంటీర్లకు పురస్కారాల ప్రధానం కార్యక్రమంలో   ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేమాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం సచివాలయాల్లో తోనే సాధ్యమని భావించి, సచివాలయాల వ్యవస్థను తీసుకురావడమే కాకుండా, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా,  గ్రామ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అదేవిధంగా చూడడం జరిగిందన్నారు, గత ప్రభుత్వంలో వృద్ధులు ,వికలాంగులు, పెన్షన్ కొరకు మండుటెండలో సైతం కార్యాలయాల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులకు గురయ్యే వారని తెలిపారు, ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి,  వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతి ఒక్కరికి కుల, మత, వర్గ, ప్రాంత పార్టీలకు అతీతంగా, ప్రజలకు ఆసరాగా నిలబడి వాలంటీర్ల ద్వారా నెలలో ఒకటవ తారీఖున కోడి కూయక ముందే ఇంటి తలుపులు తట్టి చిరునవ్వుతో వారికి టచంన్ గా పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దకే అందిస్తూ, ఎండైనా, చలైన ,వాన అయినా, పండగ అయిన, చివరకు కరోనా కష్టకాలంలో కూడా వెను తిరగక, వెన్ను చూపక ప్రజా సేవే పరమావధిగా, సేవలు అందిస్తున్న మానవతా మూర్తులైన వాలంటీర్ల సేవను గుర్తించి వారికి చేస్తున్న చిరు సత్కారం, చేయడం జరుగుతుందన్నారు.  మండలంలో 194 మంది వాలంటీర్లకు గాను ఐదు మంది సేవా రత్న, అలాగే 162 మందికి సేవ మిత్రాలు గా గుర్తించి వారికి ఈ సత్కారం చేయడం జరుగుతుందని ఆయన తెలియ చేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ బి, కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, జెడ్ పి టి సి ముదిరెడ్డి దిలీప్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ ఆర్ ఎస్ ఆర్, సర్పంచులు తుమ్మల చంద్రశేఖర యాదవ్, సిద్ది గారి వెంకట సుబ్బయ్య, సుదర్శన్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్, ఎంపీటీసీలు ముది రెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, రఘురాం రెడ్డి, దుంప నాగిరెడ్డి, సాదక్ వలి, వైయస్సార్ సిపి నాయకులు పి, ప్రదీప్ రెడ్డి, హస్రత్, తదితరులు పాల్గొన్నారు.

About Author