యువనేతను కలిసిన పెద్దతుంబళం గ్రామస్తులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెద్దతుంబళం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మా గ్రామానికి ముస్లిం విద్యార్థులకు ఉర్దూ పాఠశాల లేదు.జూనియర్ కాలేజీ లేదు.మా గ్రామ ఇలవేల్పు తిమ్మప్ప గుడికి సీసీ రోడ్డు నిర్మించాలి.గ్రామంలో ఉన్న అలకనుమ ప్రాజెక్టు నుండి పంటపొలాలకు తూము ఏర్పాటు చేయాలి.13వేల జనాభా ఉన్న పెదతుంబలం మేజర్ పంచాయితీని మండల కేంద్రంగా ప్రకటించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చా గ్రామసీమలను నిర్లక్ష్యం చేశారు.టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సిసి రోడ్లు, ఎల్ ఇడి విద్యుత్ దీపాలు, ఇంటింటికీ మరుగుదొడ్డి వంటి కార్యక్రమాలను చేపట్టాం.టిడిపి అధికారంలోకి వచ్చాక అవసరాన్ని బట్టి ఉర్దూ పాఠశాల, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం.తిమ్మప్పగుడికి వెళ్లే రహదారితోపాటు గ్రామంలో అవసరమైన చోట్ల సిసి రోడ్లు నిర్మిస్తాం.