PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలి

1 min read

కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మరియు ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు.

పల్లెవెలుగు వెబ్  ఆదోని: డివిజన్ లో శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మరియు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. గురువారం మధ్యాహ్నం మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గణేష్ చతుర్థి పండుగ ముందస్తు ఏర్పట్లపై అధికారులు, గణేష్ కమిటీ, మరియు విశ్వహిందూ పరిషత్ కమిటీ మరియు క్రైస్తవ మత పెద్దలతో కలసి పీస్ (శాంతి) కమిటీ  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని సూచించారు.గణేష్ శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లో రహదారులు మరమ్మత్తులు చేపట్టాలని, విద్యుత్తు అంతరయం కలగకుండా చూడాలని, వేలాడే విద్యుత్ తీగలను సరిచేయాలని అన్నారు. ప్రధాన కూడలి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు,  బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పండుగను విజయవంతం చేయాలని సూచించారు.మద్యం దుకాణాలు ఒక రోజు పాటు మూసి ఉంచాలని ఆదేశించారు.శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ని జరుపుకోవాలని అన్నారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో  జరుపుకోవాలని సూచించారు.గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,  కమిటీల సభ్యులు అందరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని అన్నారు. గణేష్ మండపాలలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపానికి ఒకరు లేదా ఇద్దరు ఇన్చార్జిని నియమించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి వినాయకుని నిమజ్జనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు.ప్రతి నిమజ్జన స్థలాలలో లైటింగ్, బ్యారికేడ్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని  అగ్నిమాపక అధికారిని ఆదేశించారు.వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా అందరూ గణేష్ మండలి నిర్వాహకుల పూర్తి వివరాలు అందించాలని కోరారు. ప్రతి మండపం యొక్క సమాచారం తప్పనిసరి అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.వర్షాలు కురుస్తుండడంతో మండపాల వద్ద చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సరిపోను క్రేన్ల లను ఉంచాలని అన్నారు,నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు మూసీ వేయాలని అయన ఆదేశించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అన్ని గణేష్ మండలి వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.వినాయకుల నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని తెలిపారు. వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, వినాయక ఉత్సవాలు, నిమజ్జనం ప్రాంతం వద్ద బ్యారికలను ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో  డి.ఎస్.పి  శివ నారాయణ స్వామి,  డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి ఆదోని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కే. శాంత తాసిల్దారు వెంకటలక్ష్మి,   తదితరులు పాల్గొన్నారు.

About Author