NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయ‌క చ‌వితికి సెల‌వు లేదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సెప్టంబ‌ర్ 10న జ‌రిగే వినాయ‌క చ‌వితికి రాష్ట్ర ప్రభుత్వం సెల‌వు ర‌ద్దు చేసింది. నెగోషియ‌బుల్ ఇన్స్ట్రూమెంట్ యాక్ట్ ప్రకారం సెల‌వు ఇవ్వాలి. గ‌త ఏడాది వ‌ర‌కు ఇది కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం కూడ ఈ ఏడాది సెల‌వు ప్రక‌టించింది. కానీ ఏపీ ప్రభుత్వం సెల‌వు ఇవ్వలేదు. ఈ విష‌యం పై బ్యాంకు ఉద్యోగులు మండిప‌డుతున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ ఈ విష‌యం పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శికి లేఖ రాసింది. దీనికి తెలంగాణ‌లో బ్యాంకులు విడుద‌ల చేసిన కేలెండ‌ర్ జ‌త చేసింది. అయితే.. బ్యాంకు యూనియ‌న్స్ రాసిన లేఖ పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంద‌న్న దాని పై ఉద్యోగులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

About Author