PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలి

1 min read

– ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన విజ్ఞప్తి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈనెల 26 వ తేదిన జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తో కలిసి  రాంభొట్ల దేవాలయము, వినాయక ఘాట్ , జొహరాపురం సమీపంలో కేసీ కెనాల్ గేట్ లను జిల్లా కలెక్టర్   పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  నిమజ్జనోత్సవం సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా  ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు..ఈ సంవత్సరం నీటి ఎద్దడి ఉండడం వల్ల కేసి కెనాల్ లో దాదాపు 8 అడుగుల నీరు ఉండేలా నీటిని వదులుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.   మొదటగా రామ్ బొట్ల దేవాలయంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని, ఓల్డ్ టౌన్ నుండి వినాయక.విగ్రహాలు  వచ్చే రహదారిని పరిశీలించారు. రహదారి పొడవున ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తూ కావలసిన విధంగా లైట్లు , త్రాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ  క్రేన్ల సహాయంతో నిమజ్జన కార్యక్రమము వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.మత్స్య శాఖకు సంబంధించి 120 మంది గజ ఈతగాళ్ళను, లైఫ్ జాకెట్ లను ఘాట్ వద్ద ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారిని అదేశించారు. కేసి కెనాల్  లో నీటిని 8 అడుగులు ఉండేలా, జొహరాపురం దగ్గర ఉన్న కేసి కెనాల్ గేట్లను మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్ ఈ నిఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, నగర మేయర్ బి వై రామయ్య, కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్,ఇరిగేషన్  ఎస్ ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఫిషరీస్ , తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author