PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిబద్ధతగల నేత విన్నకోట

1 min read

– ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఘన నివాళి
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: సీనియర్ పాత్రికేయులు , కార్మికనేత , రంగస్థల ప్రముఖుడు విన్నకోట వేంకటేశ్వరావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు నివాళులు అర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఇటీవల కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు విన్నకోట వెంకటేశ్వర రావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్క్ంగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశానికి
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విన్నకోట వెంకటేశ్వరావు జర్నలిస్ట్ గా, కార్మికసంఘ నాయకునిగా, కళాకారుడిగా సేవలు అందించారని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో విన్నకోట కీలక పాత్ర పోషించారన్నారు. ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ విన్నకోట వెంకటేశ్వరావు నిబద్దత కలిగిన పాత్రికేయుడని , కార్మిక సంఘాలలో పనిచేశారని , కార్మిక సంఘాలలో ఆయనకున్న అపారమైన అనుభవం ఏపీయూడబ్ల్యూజే కు చాలా ఉపయోగపడిందని అన్నారు. విన్నకోట మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తి అన్నారు. పాలకొల్లులో జర్నలిస్టులకు ఇంటి స్థలాలను అందరికి వచ్చే విధంగా కృషి చేశారన్నారు.ఆయన లేని లోటు తీర్చ లేనిదని అన్నారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన విన్నకోట యువశక్తి పత్రికను స్థాపించి , కార్మిక సంఘాలలో సేవలు అందించారని తెలిపారు. బతుకు తెరువు కోసం పాలకొల్లు వచ్చిన విన్నకోట యాభై ఏళ్లపాటు పత్రికా రంగంలో కొనసాగారని , ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లో వివిధ బాధ్యతలు చేపట్టి జర్నలిస్టు సమస్యలపై విశేషకృషి చేశారన్నారు.కార్మికులకు చేసిన సేవకు 1998 లో రాష్ట్రప్రభుత్వం శ్రమశక్తి ఆవార్డు ప్రదానం చేసిందని , నాటకరంగంలో మూడుసార్లు నంది ఆవార్డు సాధించారని అన్నారు. పాలకొల్లులో జరిగిన విన్నకోట సంస్మరణ సభకు వెయ్యి మంది పాల్గొన్నారని తెలిపారు.తొలుత విన్నకోట చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు .విన్నకోట కుమారుడు విన్నకోట వెంకట రమణ మాట్లాడుతూ నాన్నతో ఏపీయూడబ్ల్యూజేకి చిరకాల అనుబంధం ఉందన్నారు. విజయవాడ లో సంస్మరణసభ ఏర్పాటు చేసిన ఏపీయూడబ్ల్యూజేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యునియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్ట్స్ విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి , కొండా రాజేశ్వరరావు, ఐజేయూ సభ్యులు ఎస్కే బాబు, సాంబశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. జయరాజు, కౌన్సిల్ సభ్యులు దారం వేంకటేశ్వరావు, జి రామారావు, దాసరి నాగరాజు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్ వసంత్ , జర్నలిస్టు మిత్రులు పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author