PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యాంగ ఉల్లంఘనలు హద్దుమీరి పోతున్నాయి..

1 min read

– భారత్ బచావో తోనే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం..
– భారత్ బచావో సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ప్రస్తుతం భారత దేశం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం పెను ప్రమాధంలో ఉన్నవి. దేశంలో ఎటు చూసినా రాజ్యాంగ ఉల్లంఘనలు. హక్కుల ఉల్లంఘనలు హద్దుమీరి పోతున్నాయని. భారత్ బచావో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో ఉంటూ జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్తలను ప్రైవేటు వ్యక్తుల చేతులలో పెడుతూ ప్రజాస్వామ్యానికి పెనుముప్పు తీసుకువస్తుందన్నరు. నీరు, నిప్పు ,గాలి ,భూమి, కాశం , పంచ భూతాలను దేనిని వదలకుండా అన్ని ప్రకృతి సంపదలను వదలకుండా ప్రైవేటైజేషన్ చేస్తుందన్నరు, ప్రశ్నించిన విలేకరులను వారికి సహకరించిన వారి పై దేశద్రోహం కేసులు పెట్టి పెద్ద పెద్ద జైళ్ల కు పంపుతుందన్నారు, ఉదాహరణకు సంజీవ్ బట్టి ఐపీఎస్, ప్రొ.జి.ఎస్. సాయిబాబా, తీస్తా సేతల్వాద్ ప్రముఖ విలేకరిని జైళ్లకు పంపారన్నారు. గౌరీ లంకేష్ లాంటి ప్రజాస్వామ్య విలేకరులను చంపివేసారు కూడా. రాజకీయ నాయకులను, నిజాయితీ కలిగిన ఉద్యోగులను ఏసీబి, ఈడీలను పంపి, న్యాయస్తానాలలో తప్పుడు కేసులు పెట్టి బయబ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. టీవీ డిబెట్లలో రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆరెసెన్స్ , బిజెపి నాయకులు బహిరంగంగా ప్రకటిస్తున్నారన్నరు. బ్యాంకులు లూటీ చేసి దేశం విడిచి పారిపోయిన దేశద్రోహులను పట్టుకు రాకుండా లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఆ భారాన్ని సామాన్య ప్రజలపైన వేస్తూ ప్రజలను దారిద్యములోనికి నెట్టి వేస్తున్నారన్నారు. క్రోని క్యాపిటలిజం పేరుతో ప్రభుత్వ ధనాన్ని అంబానీ, ఆధాని లాంటి బడ కార్పొరేట్ వ్యక్తులకు దోచి పెడుతూ ప్రభుత్వ ఖజానా కాళీ చేస్తున్నారన్నారు. ఈ ఫాసిజం, మనువాదుల నుండి దేశాన్ని కాపాడడానికి భారత్ బచావో ముందుకు వచ్చింది. కావున కొత్త బస్టాండ్ దగ్గర. ఏలూరు జిల్లా కేంద్రo సి.ఐ.టి.యు భవనంలో ఈనెల 12వ తేదీ ఏర్పాటు చేసిన సభకు నేటి తరం యువతీ యువకులు ముందుకు రావాలని భారత రాజ్యాంగాన్ని .ప్రజా పరిరక్షణ కాపాడాలని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరుకావలసిందిగా పిలుపునిచ్చారు. ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతున్నామన్నరు. భారత దేశాన్ని కాపాడుకోవడానికి మీ వంతు సహకారాన్ని అందించ లని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాట్రు బసవరాజు, నూకపైయి కార్తీక్ మతే బాబి (బి జె ఎస్) గుబ్రల నాగేశ్వరరావు, పాము రవీంద్రనాథ్, కర్రే అంబేద్కర్, జి మధు, కాపుదాసి రవికుమార్, బత్తుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

About Author