PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తప్పవు

1 min read

– జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
– ప్రతి వాహనదారుడూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు తెలిపారు.http://kurnoolpolice.in/trafficmitra/ TRAFFIC MITRA లో భాగంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రజలు పంపించిన ఫోటోల ఆధారంగా ఇప్పటివరకు 2,891 మంది పై ట్రాఫిక్ మిత్రకు ఫిర్యాదులు వచ్చాయి.కర్నూలు ట్రాఫిక్ పోలీసు విభాగం వారు నిర్ధారణ చేసి 162 మంది పై రూ. 94,438 /- జరిమానా విధించారు
KURNOOL TRAFFIC MITRA పోలీసు వెబ్ సైట్ లో యువత, ప్రజలు ఫిర్యాదులు చేస్తూ వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తెలియజేశారు.
1) రాబిన్ వీరన్న – కర్నూలు.
కర్నూలు పట్టణంలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళే, వచ్చే సమయంలో విద్యార్దులు ఉదయం, సాయంత్రం వేళల్లో త్రిబుల్ రైడింగ్ , స్నేక్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
2) చక్రవర్తి – కర్నూలు.
ఆటో డ్రైవర్లు ఆటోలలో హై సౌండ్ లౌడ్ స్పీకర్లు వాడుతున్నారని ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
3) నరసింహారెడ్డి – కర్నూలు.
ప్రతి ఓక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రాజ్యంగం అందరికి ఒకటే అని తెలిపారు.
4) షంషీర్ – కర్నూలు .ప్రమాదాన్ని పసిగట్టలేమని, ఊహించలేం, ఎటువైపు నుంచి ముంచుకొస్తోందో తెలియదు, యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని వారి పై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 5) గజేంద్ర – కర్నూలు.యువకులు సెల్‌ ఫోన్‌, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపటం వంటివి చేస్తున్నారని అలాంటి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
6) గంగాధర్ – కర్నూలు.
కొందరు వాహనదారులు ర్యాష్‌ గా డ్రైవింగ్‌ చేస్తున్నారని, వారు ప్రమాదాల బారిన పడడంతో పాటు ఇతరులనూ ఇబ్బంది పెడుతున్నారని, ట్రాఫిక్‌ రూల్స్ పై అందరికీ అవగాహన ఉండాలని, జరిమానా తప్పించుకోవాలంటే నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపారు.
గత వారం రోజులుగా (మార్చి 12 నుండి మార్చి 18 వరకు) ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పై 64 కేసులు నమోదు చేశారన్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు పాటిస్తూ గమ్యాలకు క్షేమంగా చేరాలని ఈ సంధర్బంగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.

About Author