బెంగాల్ లో హింస !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో మొదలైన రభస కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం కూడా హింస చోటుచేసుకుంది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దాడిలో పోలీసులు గాయపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు. హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు ఈ నెల 14వ తేదీ దాకా నిలిపేశారు. పలు ప్రాంతాల్లో 15వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.