భార్యతో బలవంతపు శృంగారం నేరం కాదు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : భార్యతో బలవంతపు శృంగారం చేసినా.. దానిని నేరంగా పరిగణించబోమని చత్తీస్ఘడ్ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు భారత శిక్ష స్మృతి 376వ అధికరణ కింద దాఖలైన అభియోగాల నుంచి 37 ఏళ్ల వ్యక్తిని విముక్తుణ్ణి చేసింది. అయితే అతని పై 377 అధికరణ కింద నమోదైన అసహజ నేరాలతో పాటు ఇతర అభియోగాలు కొనసాగుతాయని పేర్కొంది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య వయసు 18 ఏళ్ల లోపు లేకపోతే.. బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కింద రాదని, 376 అధికరణంలోని రెండో మినహాయింపు దీనిని స్పష్టం చెబుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అందుకే అభియోగాల నుంచి విముక్తి చేసినట్టు తెలిపారు.