సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించిన విశాఖ శారదా పీఠాధిపతులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సనాతన ధర్మ వైదిక ప్రచార యాత్రలో భాగంగా శ్రీ విశాఖ శారదా పీఠాధిపతులు (ఉత్తరాధికారి) శ్రీ స్వత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ వారు కార్తీక మాసంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయమును సందర్శించారు.పూజ్య శ్రీ స్వామీజీ వారికి ఆలయ ఎగ్జిక్యూటివ్ శివరామకృష్ణ దంపతులు సాంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకున్నారు. తదనంతరం పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రుద్ర మంత్రములతో జలాభిషేకం, బిల్వార్చన, మహా మంగళహారతి నిర్వహించారు.తదనంతరం పూజ స్వామీజీ సూర్య దత్త గోసంరక్షణ చాలను సందర్శించి శ్రీకృష్ణ పరమాత్మకు పూజలు నిర్వహించి గో పూజలు నిర్వహించి గోమాతలకు పండ్లు కూరగాయలు తినిపించారు.అనంతరం 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతా రెడ్డి ల దంపతులు పూజ్య శ్రీ స్వామీజీ వారు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదము ఆశీస్సులు పొందడం జరిగినది.భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ వారి దర్శనం ప్రసాదం, ఆశీర్వచనం పొందడం జరిగినది.