PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్ వారియ‌ర్ గా విశాఖ స్టీల్ ప్లాంట్..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆక్సిజ‌న్ అవ‌స‌రం భారీగా పెరుగుతోంది. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త ఆస్పత్రుల‌ను వేధిస్తోంది. ఈ స‌మ‌యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ క‌రోన యోధుడి అవ‌తామెత్తింది. లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్పత్తి చేస్తూ .. ఆస్పత్రుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త తీరుస్తోంది. వివిధ రాష్ట్రాల‌కు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ విశాఖ‌ప‌ట్నం నుంచే త‌ర‌లిస్తున్నారు. క‌రోన సంక్షోభంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది. స్టీల్ ప్లాంట్ లో వివిధ అవ‌స‌రాల నిమిత్తం ఆక్సిజ‌న్ ను ఉప‌యోగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఆక్సిజ‌న్ ఉత్పత్తి యూనిట్ ను స్టీల్ ప్లాంట్ లో నెల‌కొల్పారు. ఇప్పుడు అదే ఆక్సిజ‌న్ ను ఎయిర్ స‌ప‌రేష‌న్ ద్వార మ‌లినాలు తొల‌గించి శుద్ధి చేసి ఆస్పత్రిల్లో వాడుతున్నారు. ప్రతి రోజు 100 ట‌న్నుల లిక్విడ్ ఆక్సిజ‌న్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అవుతోంది. ఇప్పటి వ‌ర‌కు 8842 ట‌న్నుల లిక్విడ్ ఆక్సిజ‌న్ ను స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం స‌గ‌టున 60 ట‌న్నుల లిక్విడ్ ఆక్సిజ‌న్ ప్రతి రోజు ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్తు అవ‌స‌రాల దృష్ట్యా ఉత్పత్తి పెంచ‌నున్నారు.

About Author